Tuesday, January 21, 2025

‘శేఖర్’కు మంచి స్పందన

- Advertisement -
- Advertisement -

వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో సుధాకర్ ఇంపెక్స్ పతాకంపై డా. రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం శేఖర్. ఈ చిత్రం తాజాగా విడుదలై అన్ని థియేటర్స్‌లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతూ హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా చిత్ర నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ “మేము చేసిన రీమేక్ సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. జోసెఫ్ సినిమా నాకు బాగా నచ్చి ఈ సినిమాను రూపొందించాము. ప్రేక్షకులందరూ క్లైమాక్స్ అదిరిపోయింది, రాజశేఖర్ ఆడియన్స్‌కు మంచి మెసేజ్ ఇచ్చారు అని చెప్పడంతో మాకు చాలా సంతోషం వేసింది. ఈ సినిమాను తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో 300 థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే విడుదల చేసిన అన్ని చోట్ల నుండి పాజిటివ్ స్పందన వస్తోంది. ఈ సినిమాలో శివాని చాలా బాగా నటించింది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News