జైపూర్: మరో రెండేళ్ల తర్వాత జరిగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బరిలో నిలుస్తారని కాంగ్రెస్ నాయకుడు గోవింద్ సిగ్ దొతాశ్రా జోస్యం చెప్పారు. సోమవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు బార్మర్‌కు చెందిన బిజెపి ఎంపి కైలాష్ చౌదరి, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు గులాంబ్ చంద్ కటారియా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియాకు బహిరంగ సభలలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు. స్థానిక రైతు నాయకుడు, ఎంపి కైలాష్ చౌదరికి తనతోపాటు ఫోటో దిగే అవకాశం కూడా అమిత్ షా కల్పించేదని ఆయన అన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా షెకావత్ నిలిచే అవకాశమే అధికంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Shekhawat to be BJP’s CM face in Rajasthan