హైదరాబాద్: భాగ్యనగరం సిగలో మరో మణిహారం చేరింది. హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మించిన షేక్‌పేట ఫ్లైఓవర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రూ. 333 కోట్లతో 2.7 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా మెహదీపట్నం – హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికేపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -