Monday, December 23, 2024

ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడంతో తాజాగా ఆ పార్టీ తమ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్‌గా ముహమ్మద్ ఇక్బాల్ పేర్లను పేర్కొంది. కౌన్సిలర్‌గా షెల్లీ ఒబెరాయ్ తొలిసారి గెలుపొందారు. ఆమె తూర్పు పటేల్ నగర్, వార్డ్ నెం. 86 నుంచి గెలుపొందారు. అంతకు ముందు ఆమె ఢిల్లీ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఢిల్లీ మేయర్‌గా మహిళకు అవకాశం ఇస్తానని ఇంతకు మునుపే ఆప్ ప్రకటించింది. అదే విధంగా ఆ పదవికి మహిళను ఎంపిక చేసింది.

డిప్యూటీ అభ్యర్థి ఇక్బాల్ ఆప్ నేత. ఈయన ఆరుసార్లు ఎంఎల్‌ఏ అయిన షోయబ్ ఇక్బాల్ కుమారుడు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 17వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 250 స్థానాలకు ఆప్ 134 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 104 స్థానాలు గెలుచుకుంది. కాగా కాంగ్రెస్ 4 సీట్లకే పరిమితం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News