వికారాబాద్: ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ గొర్రెల పథకంలో డీడీలు చెల్లించిన గొర్రెల కాపరులు ఇంకెప్పుడు గొర్రెలను పంపిణీ చేస్తారని ఆందోళన చెందుతున్నారు. వికారాబాద్ జిల్లావ్యా ప్తంగా గొర్రెల పం పిణీ కార్యక్రమంలో భాగంగా మొద టి విడతలో 1047 మ ంది లబ్ధిదారులకు రూ. 93 కోట్ల రూపాయల సబ్సిడీతో గొర్రెలను ప్రభుత్వం ప ంపిణీ చేసింది. రెండో విడత గొ ర్రెల పంపిణీ కార్యక్రమానికి గాను యూ నిట్ ధరను ప్రభుత్వం పెంచింది. ఒక్కో యూనిట్ ధర రూ. ఒక లక్ష 75 వేల కాగా, లబ్ధిదారులు రూపాయలు 43 వేల 750 రూపాయలు డిడి రూపంలో చెల్లించాల్సి ఉంది. జిల్లాలో 20 మండలాల గొర్రెల కాపరులు డీడీలు చెల్లించి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేయకపోవడంతో గొర్రెల కాపరులు ఆందోళన చెందుతున్నారు. కురుమ సంఘం నాయకులు ఈ విషయాన్ని పలు సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రుల దగ్గర కూడా సమస్యను పరిష్కరించాలని, త్వరగా గొర్రెలను పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు.
అయినప్పటికీ ప్రభుత్వం తొందరగా గొర్రెలను పంపిణీ చేయడం లేదు. పశుసంవర్ధక శాఖ అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలను గుర్తించి లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ తెలంగాణలో గొర్రెలను పంపిణీ చేయాల్సిన విషయాన్ని గుర్తించిన ఇతర రాష్ట్రాల వారు గొర్రెల ధరలను అమాంతంగా పెంచి తెలంగాణ గొర్రెల కాపరులకు ధరను పెంచి కృత్రిమ కొరత సృష్టించారు. దీంతో గొర్రెల కాపరులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి రెండు మూడు రోజులపాటు వివిధ గ్రామాలను తిరిగి గొర్రెలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా అధిక ధరలు చెప్పడంతో గొర్రెల కాపరులు అనుకున్నంత త్వరగా గొర్రెల పంపిణీ జరగడం లేదు. గొర్రెల పంపిణీ కాకుండా నగదు బదిలీని చేపట్టాలని కురుమ సంఘం నాయకులు, గొర్రెల కాపరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.