Friday, April 4, 2025

ఫిలింనగర్‌లో నీటి కుంటలో పడి గొర్రెల కాపరి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గొర్రెలు మేపడానికి వెళ్లి కుంటలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిజెఆర్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ – స్వప్న దంపతులకు పవన్(20) అనే కుమారుడు ఉన్నాడు. పవన్ ఆదివారం గొర్రెలను మేపడానికి ఫిల్మ్‌నగర్‌లోని హకీంపేట కుంట ప్రాంతానికి వెళ్లాడు. చెరువులో దిగి గొర్రెలను శుభ్రం చేస్తుండగా అతడు నీటిలో మునిగిపోయాడు. పవన్‌ను రక్షించేందుకు వెళ్లి మరో యువకుడు కూడా మునిగిపోతుండగా స్థానికులు కాపాడారు. పవన్ మాత్రం కనిపించకపోవడంతో ఆదివారం రాత్రి గాలించారు. ఎక్కడ ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కుంటవద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News