Monday, January 20, 2025

ఒక్కడు.. 79 మంది చైనా సైనికులను మట్టుపెట్టాడు

- Advertisement -
- Advertisement -

 

ఇటానగర్ : సరిహద్దులలో దేశం కోసం వీరోచితంగా పోరాడి, మంచుకొండలలో సమాధి అయిన వీర జవాన్లలో అత్యధికుల చరిత్ర అజ్ఞాతంగానే ఉంది. వీరిలో పలువురికి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ సముచిత పురస్కారాలు దక్కలేదు. ఈ దశలో భారతీయ సైన్యానికి చెందిన హవల్దార్ షేరే థాపా పేరు ప్రముఖంగా నిలుస్తోంది. 1962 భారత్ చైనా యుద్ధం సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబంసిరి సెక్టార్‌లో షేరే పేరుకు తగ్గట్లుగానే నిజంగానే వీరోచితంగా పోరు సల్పాడు. చైనా సైన్యం ఆక్రమణను ఒకే ఒక్కడు చాలా సేపటివరకూ నిలువరించారని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమా ఖండూ ఈ ఏడాది ఆరంభంలో ట్వీటు వెలువరించారు. ఈ అజ్ఞాత వీరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇటువంటి అజ్ఞాత వీరులు ఎందరో ఉన్నారని తెలిపారు.

జమ్మూ కశ్మీర్ రైఫిల్స్ దళంలోని రెండవ బెటాలియన్‌కు చెందిన థాప అప్పట్లో సరిహద్దులు దాటి ఆక్రమణలకు వస్తోన్న చైనా సైనికులకు అడ్డుకట్టగా మారాడు. 79 మంది చైనా సైనికులను మట్టుపెట్టాడు. పలువురిని గాయపర్చాడు. తరువాత ఆయన ఈ కాల్పుల క్రమంలో అమరుడు అయ్యాడు. ఈ ఘటన జరిగి 60 ఏండ్లు దాటింది. అయితే ఇప్పటికీ ఈ వీరుడి సాహసం కేవలం చరిత్ర పుటల్లో నిలిచింది. తప్ప శత్రువును దెబ్బతీసి తాను ప్రాణాలు వదిలిన ఈ వీరుడిని తగు గౌరవ పురస్కారం ఇప్పటికీ కేంద్రం నుంచి అందలేదు . ఆయన ఒక్కడు వందలాది మంది చైనా సైనికుల చొరబాట్లను ఆపగలిగారు. అయితే ఇప్పటికీ ఆయన బలిదానానికి మనం చేసింది కేవలం నామమాత్రపు సంస్మరణలు తప్ప మరోటి లేదని కల్నల్‌గా రిటైర్ అయిన సెకండ్ లెఫ్టినెంట్ అమర్ పాటిల్ తెలిపారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో లోక్‌సభ ఎంపి తాపీర్ గావో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. థాపకు మరణానంతర శౌర్య పతకం బహుకరించాల్సి ఉందని విన్నవించుకున్నారు. నేపాల్‌ల 1928లో జన్మించిన థాప 1945 డిసెంబర్ 27 నుంచి జెకె రైఫిల్స్ దళంలో సేవలు అందించారు. తరువాత ఇండియన్ ఆర్మీలో 1957లో బాధ్యతలు నిర్వర్తించారు. తరువాత ఆయన సుబేదార్ షేర్ బహద్దూర్ సారధ్యంలోని దళంలో ప్లాటూన్ హవల్దారు అయ్యారు. చైనా భారత్‌పై దాడి దశలో ఆయన వీరోచిత పోరు గురించి ఇప్పటికీ సైన్యంలో గొప్పగా చెపుతూ ఉంటారు. చైనా బలగాలు ముందుకు రాకుండా ఆయన తన శక్తియుక్తులను వినియోగించుకుని ఎంతో తమా ఛుంగ్ ఛుంగ్ వద్ద గస్తీ బాధ్యతను నిర్వర్తించారు. ఎగువ సుబన్‌సిరి జిల్లాలని రియో బ్రిడ్జి వద్ద తమా ఛుంగ్‌ఛుంగ్ సమీపంలో ఆయన కాపలా దేశ సరిహద్దుల రక్షణలో చిరస్మరణీయ ఘట్టం అయిందని అప్పటి పోరును గుర్తు చేసుకున్న రిటైర్డ్ కల్నల్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News