మన తెలంగాణ/హైదరాబాద్: మంజీర నది ఒడ్డున శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు రోజుల పాటు సహస్ర చండీయాగం ఘనంగా జరిగిందని సిఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు. చండీ మహా యాగం విజయవంతమైన సందర్భంగా ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పురస్కరించుకొని తన వ్యవసాయ క్షేత్రంలో శేరి లక్మి,సుభాష్ రెడ్డి దంపతులు పారిజాతం మొక్కలను నాటారు. లోకకల్యాణార్థం నిర్వహించిన చండీ మహా యాగంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారన్నారు. పచ్చటి ప్రకృతి చండీ మాత కు అత్యంత ప్రీతిపాత్రమైన విషయమన్నారు.
మొక్కలను మహావృక్షాలు గా మార్చి అమ్మ వారి దయకు పాత్రులు అయ్యేవిధంగా ప్రతి ఒక్కరు అవకాశమున్న చోట మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కాలుష్య నివారణకు చెట్ల పెంపకం ఎంతగానో దోహదపడుతుందని సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా మానవాళి మనుగడ నిరంతరం సుఖ సంతోషాలతో కొనసాగు తుందని వివరించారు. కార్యక్రమంలో హవేళిఘనపూర్ ఎంపిపి శేరి నారాయణ రెడ్డి, నిజాంపేట జెడ్‌పిటి సి పంజా విజయ్ కుమార్, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు పుల్లన్న గారి ప్రశాంత్ రెడ్డి హవేలి ఘనపూర్ మండలం ఎంపిటిసి అర్చన శ్రీనివాస్, సర్పంచ్‌లు జాండ కాడి దేవా గౌడ్, మహిపాల్ రెడ్డి, శ్రీను నాయక్, స్వామి నాయక్, సరితా సాయి గౌడ్, మన్నే లక్ష్మీనారాయణ నాయకులు దొమ్మాట రాఘవరెడ్డి, సాప ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.