Sunday, November 17, 2024

రైతు రాజ్యం రావాలి

- Advertisement -
- Advertisement -

రైతు ఆత్మహత్యలు లేని పాలన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో దేశంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ రావాలని మహారాష్ట్ర రైతులు తీర్మానించారు. తెలంగాణలో ముఖ్యమం త్రి కెసిఆర్ మిషన్ మోడ్ పాలనతో తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు కనిపించడం లేదని, ఇ ప్పుడు వ్యవసాయం పండుగలా మారిందని, అదే పాలన మహారాష్ట్రాలోనూ కోరుకుంటున్నామని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ తో లక్షల ఎకరాలకు సాగునీరు, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉ చిత కరెంట్, రైతు బంధు, 5 లక్షల రైతు బీమా, లాంటి పథకాలతో రైతులంతా సంతోషంగా పం టల సాగు చేస్తున్నారని, ధాన్య ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రాన్ని దాటేసి మొదటి స్థానంలో నిలిచిందని షెట్కారీ సంఘటన నేతలు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రైతున్నలు ఇప్పుడు దేశానికి అన్నంపెట్టే అన్నదాతలయ్యారని వారు ప్రశంసించారు.
పెద్ద ఎత్తున చేరికలు
ఇటీవలి ఇస్లాంపూర్ పర్యటన సందర్భంగా బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు సిఎం కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరిన ప్రముఖ షెట్కారీ సంఘటన్ మహారాష్ట్ర అధ్యక్షుడు రఘునాథ్ పాటిల్ ఆధ్వర్యంలో సాంగ్లీ జిల్లా, ఇస్లాంపూర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు  రైతులు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్రవ్యాప్తంగా వున్న షెట్కారీ సంఘటన నేతలు కార్యకర్తలతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజర య్యారు. మహారాష్ట్ర బిఆర్‌ఎస్ ఇంచార్జీ కల్వకుంట్ల వంశీధర్ రావు, మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదమ్, సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే శంకరన్న డోంగే తదితర బిఆర్‌ఎస్ నేతలు హాజరయ్యారు. ఈ బహిరంగ సభలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. మహారాష్ట్ర బిఆర్‌ఎస్ ఇంచార్జీ కల్వకుంట్ల వంశీధర్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మహారాష్ట్ర రైతులు సన్మానించాలని…..
అన్ని వర్గాలకు సమన్యాయంతో సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మహారాష్ట్ర రైతులు సన్మానించాలని నిర్ణయించారు. మహారాష్ట్ర రైతుల ఆహ్వానం మేరకు సిఎం కెసిఆర్ ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అయితే అనివార్యకారణ వల్ల హాజరు కాలేకపోయారు. దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతినిధిగా మహారాష్ట్ర బిఆర్‌ఎస్ ఇంచార్జీ కల్వకుంట్ల వంశీధర్ రావును సన్మానించించారు. సిఎం కెసిఆర్ దార్శనిక పాలన మహారాష్ట్రలో కూడా కావాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు తెలిపారు. సభను ఉద్దేశించి మహారాష్ట్ర బిఆర్‌ఎస్ ఇంచార్జీ కల్వకుంట్ల వంశీధర్ రావు మాట్లాడుతూ బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అధ్యక్షతన 2001లో పార్టీ ఏర్పాటు చేసి ఎన్ని అవాంతరాలు ఎదురైనా 13 ఏళ్ల అవిశ్రాంత పోరాటంతో అంతిమ లక్ష్యం తెలంగాణ సాధించారన్నారు. రెండు పర్యాయాలు ప్రజల ఆశీర్వాదంతో పరిపాలన చేస్తూ బంగారు తెలంగాణ సాధన దిశగా కృషి చేస్తున్నారన్నారు. లక్ష్యంతో కూడుకున్న రాజకీయాలు చేసే కెసిఆర్ పనితీరు, మిషన్ మోడ్ పాలన ఇప్పుడు దేశమంతా కోరుకుంటోందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News