Monday, December 23, 2024

బిటిపిఎస్ ఉద్యోగులకు షిప్ట్ అలవెన్స్ మంజూరు చేయాలి

- Advertisement -
- Advertisement -

పినపాక : బిటిపిఎస్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు షిప్ట్ అలవెన్స్ మంజూరు చేయాలని జెన్కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావును టీఎస్‌పిఈయూ 1535 నాయకులు కోరారు. మణుగూరులోని బిటిపిఎస్ సందర్శనకు ఆదివారం వచ్చిన ఆయనకు టీఎస్‌పిఈయూ 1535 సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి డి రాధాకృష్ణ, అదనపు కార్యదర్శి ఎం శ్రీధర్, బిటిపిఎస్ రీజియన్ ప్రెసిడెంట్ వి ప్రసాద్ తదితరులు సన్మానించారు.

అనంతరం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. గత మూడేళ్లుగా ఉద్యోగులు షిప్ట్ డ్యూటీలో పని చేస్తున్న ఇప్పటి వరకు అలవెన్స్ మంజూరు చేయాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్మాగారంలో శాంక్షన్ పోస్టులను మంజూరు చేయాలని పేర్కొన్నారు. డిపార్టెంటల్ ప్రమోషన్ కమిటీని నియమించి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని తెలిపారు. ఉద్యోగ నియామక సమయంలో కొందరి భూ నిర్వాసితుల విద్యా అర్హత తప్పుగా నమోదయిందని, దానిని సవరించి విద్య అర్హతకు అనుగుణంగా తగిన ఉద్యోగాన్ని కల్పించాలని కోరారు.

కార్మిక సంఘ నాయకులు తీసుకువెళ్లిన సమస్యలపై సిఎండి స్పందిస్తూ షిప్ట్ అలవెన్స్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కార్మిక సంఘం నాయకులు ఐతరాజు వెంకటేశ్వర్లు, సిద్దుల హుస్సేన్, రత్నాకర్, పుల్లారావు, ఆర్ రామచందర్, టి అనిల్, ఆర్ రవిచంద్ర, మహిళా నాయకురాలు సునీత, రమాదేవి, జానీ బేగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News