Tuesday, April 29, 2025

‘ఇంకెంత దిగజారుతారు’.. అఫ్రిదీపై మండిపడ్డ ధవన్

- Advertisement -
- Advertisement -

పహల్‌గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారతీయులందరూ పాకిస్థాన్‌ను తీవ్రంగా శిక్షించాలని అంటున్నారు. మరోవైపు కొందరు పాకిస్థానీయులు.. భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ భారత ఆర్మీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఉగ్రదాడిని భారత సైన్యం ఎందుకు అడ్డుకోలేకపోయిందంటూ.. అఫ్రీదీ అన్నాడు. దీంతో నెటిజన్లు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ వ్యాఖ్యలపై టీం ఇండియా మాజీ ఆటగాడు శిఖర్ ధవన్ స్పందించాడు. కార్గిల్ యుద్ధంలో వాళ్ల దేశాన్ని ఓడించిన విషయాన్ని ధవన్ గుర్తు చేశాడు. ‘ఇప్పటికే మీరు దారుణంగా పతనమయ్యారు. ఇంకా ఎంత దిగజారుతారు’ అని మండిపడ్డాడు. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు మానేసి.. తమ దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలి అంటూ హితవు పలికాడు. భారత సైన్యాన్ని చూసి మేం అంతా గర్వపడుతున్నాం అంటూ ధవన్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News