ఢిల్లీ: టీమిండియాకు కెప్టెన్‌గా ఉండడం ఎంతో గౌరవమని ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నారు. ఇప్పుడు సంతోషంగా ఉందని తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. నా దేశాన్ని నడిపించే అవకాశం వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. శిఖర్ ధావన్ నాయకత్వంలో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టి-20లు ఆడనున్నారు. జులై-13 నుంచి కొలంబో వేధికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 34 టెస్టులు, 145 వన్డేలు, 60 టి-20లు ఆడిన అనుభవం ధావన్ కు ఉంది.
టీమిండియాకు ప్రస్తుతం ఐదుగురు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేశారు. కృష్ణప్ప గౌతమ్, దేవదత్ పడిక్కల్, నితీష్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియా తమ సత్తాను పరీక్షించుకోనున్నారు. వీళ్లు దేశవాళీ క్రికెట్, ఐపిఎల్‌లో సత్తా చాటనున్నారు. కోచ్‌గా ఎంపికైన ద్రవిడ్‌కు అందరికి అవకాశాలు ఇచ్చే అలవాటు ఉంది.