Sunday, December 22, 2024

షార్ట్ రన్ చేసిన రిజ్వాన్ పై జోకులేసిన శిఖర్ ధవన్!

- Advertisement -
- Advertisement -

ప్రముఖ ఇండియన్ బ్యాట్స్ మన్ శిఖర్ ధవన్ సహచర ఆటగాళ్లతో సరదాగా ఉంటాడు. అప్పుడప్పుడు ఎక్స్ (ట్విటర్)లో జోకులు పేల్చి, అభిమానులను నవ్విస్తూ ఉంటాడు. తాజాగా అతను పాక్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్ ను ఆట పట్టించాడు. పాక్- న్యూజీలాండ్ మధ్య ఈనెల 17న జరిగిన మూడో టి20 మ్యాచ్ లో రిజ్వాన్ ఓ బాల్ ను ఎదుర్కొని రన్ తీసే ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పి దాదాపు పడబోయి, నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలో బ్యాట్ అతని చేతినుంచి జారిపోయింది. అయినా రన్ తీశాడు. బ్యాట్ లేకపోవడంతో నాన్ స్ట్రయికర్ ఎండ్ లో క్రీజ్ ను చేత్తోనే తాకి రెండో రన్ కోసం పరుగెత్తాడు. తీరా చూస్తే, అతను క్రీజ్ ను తాకలేదని తెలిసి, అంపైర్ షార్ట్ రన్ గా ప్రకటించాడు.

రిజ్వాన్ షార్ట్ రన్ తాలూకు వీడియో నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఉద్దేశించి ధవన్ ‘కబడ్డీ..కబడ్డీ…కబడ్డీ… షార్ట్ రన్’ అంటూ కామెంట్ పెట్టాడు. ధవన్ పోస్ట్ పై పలువురు క్రికెట్ అభిమానులు స్పందించి, సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

న్యూజీలాండ్ తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో రిజ్వాన్ 20 బంతులు ఆడి 24 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో పాక్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే నాలుగో టీ20 మ్యాచ్ లో రిజ్వాన్ అద్భుతంగా ఆడి 63 బంతుల్లో 90 పరుగులు చేశాడు. అయినప్పటికీ ఈ మ్యాచ్ లోనూ పాకిస్తాన్ ఓడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News