Saturday, November 23, 2024

అరుదైన గౌరవంగా భావిస్తున్నా: శిఖర్ ధావన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై శిఖర్ ధావన్ స్పందించాడు. తన కెరీర్‌లోనే ఇది అత్యంత గౌరవమైన బాధ్యతగా భావిస్తున్నట్టు వివరించాడు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని తెలిపాడు. నా దేశాన్ని నడిపించే అవకాశం దక్కడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. సీనియర్లు లేకున్నా అందుబాటులో ఉన్న యువ క్రికెటర్లతో జట్టును గెలుపు బాటలో నడిపిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు లభించిన అత్యంత అరుదైన గౌరవమన్నాడు. తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సెలెక్టర్లకు, భారత క్రికెట్ బోర్డు పెద్దలకు ధావన్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక శ్రీలంక సిరీస్‌లో విజయం సాధించడమే తమ ముందున్న ఏకైక లక్షమన్నాడు. యువ క్రికెటర్లు కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారన్నాడు. సమష్టి కృషితో లంకపై విజయం సాధిస్తామనే ధీమాను ధావన్ వ్యక్తం చేశాడు. ఇక ఎంతో అనుభవజ్ఞుడైన రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉండడం తమకు సానుకూల పరిణామమన్నాడు. ఆయన పర్యవేక్షణలో తాము మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని ధావన్ జోస్యం చెప్పాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News