Thursday, January 23, 2025

‘మై బాయ్ ఎప్పుడూ నాతోనే’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్, తన భార్య ఏషా ముఖర్జీ విడాకులు తీసుకొని సంవత్సరం అవుతోంది. శిఖర్ దావన్ కుమార్ మైనర్ కావడంతో తల్లి సంరక్షణలో పెరిగాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏషా ముఖర్జీ ఆస్ట్రేలియన్ కావడంతో భారత్ నుంచి ఆమె తన స్వస్థలానికి
వెళ్లిపోయింది. కోర్టు తన కుమారుడిని చూసేందుకు ధావన్ కు అనుమతి ఇచ్చినా ఏషా అతడిని తన దగ్గరికి రానివ్వడం లేదు. వీడియో కాల్ లో కూడా తన కుమారుడిని చూడటానికి ధావన్ ప్రయత్నించిన కూడా ఆమె నిరాకరిస్తోంది. తన కుమారుడు జోరావర్ ను తలుచుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్టు చేశారు. తన కుమారుడు ఎప్పటికీ తన తోనే ఉంటాడని మై బాయ్ పంజాబ్ జెర్సీపై తన తనయుడి జోరావర్ పేరు రాయడంతో నంబర్ వన్ వేయించి సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేశాడు. తన కుమారుడిని చూసి సంవత్సరం అవుతోందని ఫోస్టులో పేర్కొన్నారు. సంవత్సరం నుంచి కుమారుడి చూడకుండ ఉండడంతో ధావన్ ఎంతో మానసిక బాధకు గురవుతున్నాడు.

Shikhar Dhawan Shares Emotional Message

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News