Monday, December 23, 2024

15 ఏళ్ల వయస్సులోనే హెచ్ఐవి పరీక్ష చేయించుకున్నా: శిఖర్ ధావన్

- Advertisement -
- Advertisement -

టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ట్రెండ్ కు తగ్గట్టు ఫ్యాషన్ ఫాలో అవుతుంటాడు. ఐపిఎల్ ప్రారంభానికి ముందు ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధావన్ తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 15ఏళ్ల క్రితం మనాలీ టూర్ కు వెళ్లి అక్కడ తన వీపుపై పచ్చబొట్టు వేయించుకున్నానని చెప్పాడు. టాటూ వేసిన సూదితో చాలామందికి వేస్తారని తెలిసి భయపడ్డానని తెలిపాడు. 4 నెలల తర్వాత హెచ్ఐవి టెస్టు చేయించుకున్నానని వెల్లడించారు. అది నెగిటివ్ వచ్చిందని ధావన్ పేర్కొన్నాడు. వీపుపై పచ్చబొట్టును 3-4 నెలలు దాచవలసి వచ్చిందని, ఆపై తన తండ్రికి తెలిసి కొట్టాడని ధావన్ చెప్పాడు. శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్-2023 సీజన్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. మయాంక్ అగర్వాల్ స్థానంలో ధావన్ కు పంజాబ్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. ఇప్పటికే గబ్బర్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News