Saturday, December 21, 2024

దంపతుల ప్రాణం తీసిన ఆభరణాలు

- Advertisement -
- Advertisement -

లక్నో: బంగారు ఆభరణాల విషయంలో గొడవ జరగడంతో భార్యను తుపాకీతో కాల్చి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షికోహబాద్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దీపక్ యాదవ్(30), శశి యాదవ్(26) అనే దంపతుల మధ్య బంగారు ఆభరణాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఆభరణాల విషయంలో గొడవలు జరగడంతో దీపక్ సోదరుడు గోవింద్ యాదవ్ ఘర్షణలు వద్దని అతడికి చెప్పాడు. ఇప్పటి నుంచి గొడవలు పెట్టుకోనని దీపక్ ప్రమాణం చేశాడు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో తుపాకీతో కాల్చిన శబ్ధం రావడంతో కుటుంబ సభ్యులు వాళ్ల రూమ్‌కు వెళ్లారు. శశి రక్తపు మడుగులో బెడ్‌పై అచేతనంగా పడి ఉంది. దీపక్ కూడా గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీలో జాబ్ కోసం దీపక్ ప్రిపేర్ అవుతున్నాడు.

Also Read: ఎలుగుబంటిని చంపి… భర్త, సోదరుడిని కాపాడిన మహిళ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News