- Advertisement -
హైదరాబాద్: పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి శుక్రవారం నాడు జైలు నుంచి బెయిల్పై విడుదలైంది. చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న శిల్పకు ఉప్పర్పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈక్రమంలో అధికవడ్డీలు, పెట్టుబడులపై లాభాల పేరుతో పలువురిని మోసం చేసిన శిల్పాచౌదరిపై మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కేసు విచారణ నిమిత్తం పలుమార్లు కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆమెపై నమోదైన మూడు కేసుల్లోనూ బెయిల్ లభించింది. ఈ మేరకు ప్రతి శనివారం నార్సింగి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మూడు కేసులకు సంబంధించి దాదాపు 25 రోజుల పాటు చంచల్గూడా జైలులోనే ఉన్న శిల్పాచౌదరి బెయిల్పై విడుదలైంది.
- Advertisement -