Tuesday, December 17, 2024

ఆమె లాగే ఆ హోటల్ కూడా భలే బావుంది!

- Advertisement -
- Advertisement -

48 ఏళ్లొచ్చినా బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఆమెను చూసినవారెవరైనా తనకు అంత వయసు ఉందంటే నమ్మలేరు. టీనేజర్లతో పోటీ పడే మెరుపుతీగె లాంటి శరీరం ఆమెది. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నా, తను ప్రారంభించిన శిల్పాశెట్టి యాప్ పైనే ఆమె ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటుంది. యోగసనాలను ఔపోసన పట్టి, వాటిని ఇతరులకు నేర్పిస్తూ తగిన సూచనలు, సలహాలను ఇస్తూ ఈ యాప్ ను శిల్ప జనాల్లోకి బాగా తీసుకుపోయింది. బ్లూ ఫిల్ముల కేసులో భర్త రాజ్ కుంద్రా ఆమధ్య అరెస్టు కావడంతో కాస్త కుంగుబాటుకు గురైనా, ఆ తర్వాత కోలుకుని ఆతిథ్య రంగంలోకి దిగింది.

ముంబయిలో పేరున్న బాస్టియన్ హోటళ్ల చైన్ లో 50 శాతం వాటాను 2019లో శిల్పాశెట్టి కొనుగోలు చేసింది. ఈ హోటళ్ల విస్తరణలో ఆమె చురుగ్గా పాల్గొంటోంది. తాజాగా శిల్ప ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ముంబయిలోని కోహినూర్ బహుళ అంతస్తుల బిల్డింగు టాప్ ఫ్లోర్ పై బాస్టియన్ హోటల్ ను ప్రారంభించినట్లు చెబుతూ, ఆ హోటల్ ను వీడియో తీసి షేర్ చేసింది. ఈ హోటల్లోంచి ముంబయి నగరాన్నంతా చక్కగా చూడొచ్చు. పైగా ఈ ఫ్లోర్ లో ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News