Tuesday, December 17, 2024

రాజ్‌కుంద్రా అరెస్టుపై ఎట్టకేలకు స్పందించిన శిల్పాశెట్టి..

- Advertisement -
- Advertisement -

ముంబై: పోర్న్ వీడియో రాకెట్ కేసులో తన భర్త రాజ్‌కుంద్రా అరెస్టుపై గత కొన్నిరోజులుగా పెదవి విప్పని బాలీవుడ్ నటి  శిల్పా శెట్టి ఎట్ట‌కేల‌కు స్పందించారు. కొన్నిరోజులుగా రాజ్‌కుంద్రా అరెస్టుపై ఎన్నో ఆరోప‌ణ‌లు, ట్రోలింగ్ చేస్తున్నారని, పూర్తి సమాచారం తెలుసుకోకుండా వార్తలు సృష్టించొద్దని పేర్కొన్నారు. సోమవారం తన ట్వీటర్ ద్వారా శిల్ఫా ఓ ప్రకటన విడుదల చేసింది. ”గ‌తకొద్ది రోజులుగా ఎన్నో ఆరోప‌ణ‌లు, మరెన్నో ఊహాగానాలు వస్తున్నాయి. ఈ వివాదంలోకి నన్ను లాగుతూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. మీడియాతోపాటు అందరూ నన్ను నిందిస్తున్నారు. నిజనిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. ఈ కేసు విచార‌ణ‌ దశలో ఉన్న కారణంగా నేను మాట్లాడాలనుకోవడం లేదు. ముంబై పోలీసులపై, న్యాయ‌వ్య‌వ‌స్ధపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఓ కుటుంబంగా న్యాయ‌ప‌ర‌మైన ప‌రిష్కారాల కోసం అన్వేషిస్తున్నా.ఓ త‌ల్లిగా నా పిల్ల‌ల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని అడుతున్నా. దయచేసి తప్పుడు కథనాలు సృష్టించకండి” అని శిల్పాశెట్టి కోరారు.

Shilpa Shetty released statement on Raj Kundra Arrest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News