Tuesday, December 17, 2024

నేను నా పనుల్లో బిజీగా ఉన్నాను

- Advertisement -
- Advertisement -

Shilpa Shetty Said Was Busy

ఏం చేస్తున్నావని నా భర్తను అడగలేదు
ముంబయి క్రైమ్‌బ్రాంచ్‌కిచ్చిన స్టేట్‌మెంట్‌లో శిల్పాశెట్టి వెల్లడి

ముంబయి: తాను తన సినిమాలు, ఇతర సొంతపనుల్లో బిజీగా ఉంటున్నానని, తన భర్త ఏం చేస్తున్నాడని తాను ఎప్పుడూ అడగలేదని నీలి చిత్రాల రాకెట్ కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా భార్య, సినీ నటి శిల్పాశెట్టి ముంబయి క్రైమ్‌బ్రాంచ్ పోలీసులకిచ్చిన స్టేట్‌మెంట్‌లో చెపినట్లు తెలిసింది. గత జులై 23న శిల్పా శెట్టి ముంబయి క్రైమ్‌బ్రాంచ్ పోలీసులకు ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ముంబయి క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు బుధవారం ఈ కేసులో రాజ్‌కుంద్రా, ఆయన సంస్థ ఐటి విభాగం చీఫ్ రియాన్ థోర్పే, మరో ఇద్దరు నిందితులు సింగపూర్‌కు చెందిన యాష్ ఠాకూర్ అలియాస్ అరవింద్ శ్రీవాస్తవ, కుంద్రా బావ, లండన్‌కు చెందిన ప్రదీప్ బక్షీలపై కోర్టులో 1500 పేజిల అదనపు చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది.

రాజ్‌కుంద్రా నీలి చిత్రాల ద్వారా భారీ ఎత్తున సంపాదించినట్లు ఆ చార్జిషీట్‌లో ఆరోపించారు. కాగా రాజ్‌కుంద్రా 2019లో సౌరవ్ కుష్వాహా భాగస్వామిగా ఆర్మ్‌ప్రైమ్ మీడియా అనే ఒక సంస్థలో చేరినట్లు శిల్పాశెట్టి క్రైమ్‌బ్రాంచ్ అధికారులకు చెప్పారు. ఈ సంస్థ పలువురు సినీ తారలకు చెందిన వీడియోలను వారి ఇష్టం మేరకే తీసేదని ఆమె చెప్పారు. తాను ఈ విషయమై రాజ్‌కుంద్రాను అడగ్గా ఒటిటి ప్లాట్‌ఫామ్ అయిన ఈ సంస్థ బాగా నడుస్తోందని, తనకు మంచి లాభాలు కూడా వస్తున్నాయని చెప్పాడని తెలిపారు. అయితే ఆ తర్వాత కొన్ని సమస్యల కారణంగా రాజ్‌కుంద్రా సౌరబ్ కుష్వాహానుంచి విడిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News