Tuesday, December 17, 2024

సిద్ధిఖీ మృత దేహం వద్ద కంటతడిపెట్టిన శిల్పా శెట్టి

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్యపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాజీ హీరోయిన్ శిల్పాశెట్టి ఆసుపత్రికి వెళ్లి సిద్ధిఖీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సిద్ధిఖీపై కాల్పులు జరిగాయని, ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారని తెలిసిన వెంటనే భర్త రాజ్ కుంద్రాతో కలిసి శిల్పాశెట్టి అక్కడికి చేరుకున్నారు. ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

మరోవైపు సిద్ధిఖీ స్నేహితుడు, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ‘బిగ్ బాస్’ షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. సిద్ధిఖీకి నివాళి అర్పించేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా, బాబా సిద్ధిఖీ హత్యకు నిరసనగా ఆదివారం పార్టీ కార్యకాలపాలన్నింటినీ రద్దు చేశామని ఎన్సీపి ట్వీట్ చేసింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News