సిమ్లా: దేశంలో ఎండలు మెల్లగా పెరిగిపోతున్నాయి. చాలా మంది మైదాన ప్రాంతాల నుంచి కొండ ప్రాంతాలకు వెళుతున్నారు. దేశంలో చాలా మంది ఇప్పుడు హిల్ స్టేషన్ అయిన సిమ్లాకు పెద్ద సంఖ్యలో వెళుతున్నారు. ఢిల్లీ, ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి చాలామంది హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌కు వెళుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే సిమ్లాకు 30000 వాహనాల్లో పర్యాటకులు వచ్చి వాలిపోయారు. ఈ వారాంతంకల్లా మరో 4000 లేక 5000 మంది వచ్చి చేరుతారని భావిస్తున్నారు. అక్కడి హోటళ్లన్ని నిండిపోయాయి.
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు మేము ప్రయత్నిస్తున్నాము అని సిమ్లాలోని ఎస్పీ సంజీవ్ కె. గాంధీ ఇటీవల తెలిపారు. పర్యాటకుల్లో చాలా వరకు ఢిల్లీ, పంజాబ్, ఛండీగఢ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. సిమ్లా ఇప్పుడు కిక్కిరిసి పోయి ఉంది. చాలా మంది టూరిస్టులకు విడిదే దొరకడం లేదు. చాలా మంది పర్యాటకులు ఈ ఎండాకాలం కొన్నాళ్లపాటు ఉండి సేదదీరుదాం, ఆనందిద్దాం అని వస్తున్నారు.