- Advertisement -
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి శివసేన పార్టీ పేరు, విల్లు బాణం గుర్తు చెందుతాయని ఎన్నికల సంఘం(ఈసి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శివసేన పార్టీకి నాయకుడుగా ఉండడం అప్రజాస్వామికం అని కూడా ఈసి అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం శుక్రవారం ఈ మేరకు 78 పేజీల ఉత్తర్వును జారీ చేసింది. ‘అంతర్గతంగా ప్రజాస్వామిక నిర్మాణాలు లేనప్పుడు, అంతర్గత వివాదాలు చీలికలు, వర్గాల ఏర్పాటుకు దారితీస్తాయి’ అని పేర్కొంది.
మధ్యంతర ఉత్తర్వుల ద్వారా పిటిషనర్‌కు కేటాయించిన ‘బాలాసాహెబంచి శివసేన’ పేరు, రెండు కత్తులు, బల్లెం చిహ్నాన్ని తక్షణమే స్తంభింపజేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
- Advertisement -