Friday, April 11, 2025

ఆరు నెలల్లో షిండే ప్రభుత్వం కూలుతుంది: శరద్‌పవార్

- Advertisement -
- Advertisement -

ముంబై : బీజేపీ మద్దతుతో సీఎం ఏక్‌నాథ్ షిండే సారధ్యంలో మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరు నెలల్లో షిండే ప్రభుత్వం కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కేడర్‌కు పవార్ పిలుపునిచ్చారు. మంత్రి పదవుల పంపకం పూర్తయితే అసంతృప్తులు పెల్లుబుకుతాయని, ఫలితంగా ప్రభుత్వం కుప్పకూలడం తథ్యమని ఆయన అంచనా వేశారు. బీజేపీతో పొత్తు వికటిస్తే ఎమ్‌ఎల్‌ఎలంతా శివసేన గూటికే తిరిగివస్తారని విశ్లేషించారు. ఆదివారం సాయంత్రం ఎన్‌సీపీ, ఇతర పార్టీల ఎమ్‌ఎల్‌ఎలతో భేటీ సందర్భంగా పవార్ ఈ విధంగా స్పందించారని ఎన్‌సీపీ ఎమ్‌ఎల్‌ఎ ఒకరు చెప్పారు. శివసేన రెబల్ ఎమ్‌ఎల్‌ఎలు బీజేపీకి మద్దతు తెలపడంపై పవార్ అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు.

Shinde Govt will collapse in 6 Months:Sharad Pawar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News