- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలోని షిరిడీ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్-కారు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన పది మందిని ఔరంగాబాద్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొండగడపకు చెందిన ఓ కుటుంబం రెండో రోజుల క్రితం షిరిడీకి వెళ్లారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన ప్రేమలత(59), ప్రసన్న లక్ష్మి(45), అంకిత(20), నందన్(6నెలలు) గా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -