Monday, December 23, 2024

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకత శీత్లా పండుగ

- Advertisement -
- Advertisement -

పెగడపెల్లి: సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక పండుగ సీత్లా భవాని పండుగ అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని రాజారాంపల్లి తండా, ఏడు మూటలపల్లి తండా, మద్దులపల్లి తండాలలో బంజారాలు భక్తి శ్రద్దలతో సీత్లా దాటుడు పండుగను లంబాడీలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్బంగా రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సీత్లా వండుగ వేడుకల్లో పాల్గొని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాష్ట్రంలోని అన్ని కులాలలో అన్ని పండుగలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా శీత్లా పండుగను బంజర్లు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

గిరిజన జాతుల ఆరాధ్య దైవం సీత్లా భవాని దీవేనలతో తండా ప్రజలు సౌభాగ్యాన్ని పశుపక్షాదులను పాడి పంటలను కాపాడాలని అన్నారు. వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండి ఆర్ధికంగా ఎదగాలని, పశువుల ఆరోగ్యాన్ని కాపాడాలని పశువుల మేత కోసం అటవి సంపద కరిగిపోకూడదని మంత్రి సీత్లా భావనిని వేడుకున్నారు. ప్రజలందరూ ఆ తల్లి దయతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.

అంతకు ముందు లంబాడీలు భక్తి శ్రద్దలతో లంబాడి వేషదారణలో ఊరి పొలిమేరలో ఏడుగురు భవాని దేవతలను ప్రతిష్టించి అలంకరించి గిరిజన సాంప్రదాయ ప్రకారం జొన్నలు పప్పు ధాన్యాలతో గుగ్గిలను పర్వాన్నాన్ని వనదేవతలకు నైవేద్యంగా పెట్టారు. లంబాడి వేషధారణలో డప్పు చప్పుల్లతో కొలాహాలంగా లంబాడి నృత్యాలు చేస్తూ వనదేవతలకు గొర్రె మేక పోతులను ఏడుగురు దేవతలకు బలిచ్చారు. మహిళలు ఇంటి నుండి తెచ్చిన జలాలను వనదేవతలకు చల్లి స్మరించుకున్నారు.

వన దేవతల మధ్య పేర్చిన పేగు నుంచి పశువులను దాటించి పశువులకు ఎలాంటి అంటూ వ్యాధులు రాకుండా ఉండాలని, పశు సంపద బాగా పెరగాలని పాటి పంటలు బాగా పండాలని గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండాలని వనదేవతలకు లంబాడీలు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జెడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు, వైస్ ఎంపీపీ గాజులు గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచులు ఇస్లాత్ రవి నాయక్, సాయిని సత్తమ్మ, రాజేశ్వర్‌రావు, ఉప్పులంచ లక్ష్మణ్, గాజుల రాకేష్, ఇనుగండ్ల కరుణాకర్ రెడ్డి, బాబు స్వామి, ఎంపీటీసీలు కొత్తపెల్లి రవీందర్, అంజయ్య, విండో చైర్మన్‌లు ఓరుగంటి రమణారావు, మంత్రి వేణుగోపాల్, భాస్కర్ రెడ్డి, ఎఎంసీ చైర్మన్ రాజు అంజనేయులు, ఆర్‌బిఎస్ మండల అధ్యక్షుడు ఉప్పుగళ్ల నరేందర్ రెడ్డి, స్టీరింగ్ కమిటి చైర్మన్ ఇరుగురాల ఆనందం,

ఆర్‌బిఎస్ జిల్లా డైరెక్టర్ తిరుమణి నరసింహరెడ్డి, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, ప్రధానకార్యదర్శి బండి వెంకన్న, ఉపాధ్యక్షులు సాయిని రవీందర్, అందే వెంకటేశం, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు ఇస్లావత్ శేఖర్ నాయక్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ షకీల్, మండల యూత్ అధ్యక్షుడు సొల్లేటి సంతోష్ కుమార్, నలువాల లక్ష్మణ్, రహీం, ఆరెల్లి లక్ష్మిరాజం, ఏఎంసీ మాజీ చైర్మన్ నగవత్ తిరుపతి నాయక్, మాజీ కోప్షన్ సభ్యుడు ఎండి జానీ పాషా, ఏఎంసీ డైరెక్టర్లు వెల్మ సత్యనారాయణ రెడ్డి, విజయ్, తిరుపతి, నాయకులు బాలసాని శ్రీనివాస్ గౌడ్, గంగాధర్ గౌడ్, గోలి సంజీవరెడ్డి, ఇర్గురాల అజయ్, పారీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News