Wednesday, January 22, 2025

లండన్ లో శివ్ నారాయణ్ జ్యువెలర్స్ ప్రత్యేక ప్రివ్యూ

- Advertisement -
- Advertisement -

లండన్ లో జరిగిన ప్రత్యేక ప్రివ్యూతో శివ్ నారాయణ్ జ్యువెలర్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. లండన్‌లోని ది వాలెస్ కలెక్షన్ యొక్క ప్రముఖ హాల్స్ మిరిమిట్లు గొలిపే కాంతులు, ఉత్సాహపూరితమైన సంభాషణలతో నిండిపోయాయి. దాతృత్వానికి చిరునామా, వ్యాపారవేత్త, గ్లోబల్ ఐకాన్, గ్లామరస్ శ్రీమతి సుధా రెడ్డి హోస్ట్ చేసిన ఈ సాయంత్రం భారతదేశ గొప్ప వారసత్వం, శిల్పకళకు గుర్తుగా నిలిచింది.

జోసెఫ్ మస్కట్, మాల్టా మాజీ ప్రధాన మంత్రి, అలెగ్జాండ్రా సాషా, ఫస్ట్ డిప్యూటీ పార్లమెంటు సభ్యురాలు, యుగోస్లేవియా ప్రిన్సెస్ కటారినా, మఫత్లాల్ లగ్జరీ ప్రెసిడెంట్ శీతల్ మఫత్‌లాల్, ఫ్రెడ్డీ టోయ్ ఛైర్మన్, & డైరెక్టర్‌ టోయ్ & కో, రాయల్ వారెంట్ గ్యారెంటీ సహా హాజరైన అతిథులు శివ్ నారాయణ్ జ్యువెలర్స్ యొక్క ఐకానిక్ జ్యువెలరీ వీక్షించారు. వీటిలో నాలుగు రికార్డ్-బ్రేకింగ్ మాస్టర్‌పీస్‌లు, ది గణేష్ లాకెట్టు, ది రామ్ దర్బార్, ది మాగ్నిఫైయింగ్ గ్లాస్ & ది సట్లడ (సెవెన్-లేయర్) నెక్లెస్ వున్నాయి.

శివ్ నారాయణ్ జ్యువెలర్స్ ప్రై. లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ అగర్వాల్ మాట్లాడుతూ.. “శివ్ నారాయణ్ జ్యువెలర్స్ కేవలం ఆభరణాలు మాత్రమే కాదు.. ఇది అభిరుచి, చరిత్ర, తరతరాలుగా సాగే కలల కథ” అని వ్యాఖ్యానించారు. భారతదేశంలోని హైదరాబాద్‌లో స్థాపించబడిన శివ నారాయణ్ జ్యువెలర్స్ 10 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించిన ఏకైక భారతీయ ఆభరణాల వ్యాపార సంస్థ గా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News