- Advertisement -
మహారాష్ట్ర గవర్నర్‌కు శివసేన హితవు
ముంబయి: ఎంఎలసిల నియామకం విషయంలో రాజ ధర్మాన్ని పాటించాలని అధికార పార్టీ శివసేన మహారాష్ట్ర గవర్నర్‌కు హితవు పలికింది. శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో గవర్నర్ భగత్‌సింగ్‌కోశ్యారీని బిజెపి నియమించిన వ్యక్తిగా అభివర్ణించింది. రాజధర్మం పాటించే బాధ్యత బిజెపిపైనా ఉన్నదని పేర్కొన్నది. పూణెలో గత నెల 23 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంఎల్‌ఎ సంజయ్‌రాథోడ్ మంత్రివర్గం నుంచి వైదొలిగిన మరుసటి రోజు శివసేన రాజధర్మం గురించి ప్రస్తావించడం గమనార్హం. గతేడాది నవంబర్‌లోనే మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం 12మంది పేర్లను ఎంఎల్‌సి నామినేటెడ్ కోటాకు సిఫారసు చేసింది. ప్రభుత్వ సిఫారసుకు ఆమోదం తెలపడంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారని శివసేన విమర్శిస్తోంది.
- Advertisement -