ముంబయి: శివసేన చాలా పెద్ద పార్టీ అని ఎంపి సంజయ్ రౌత్ తెలిపారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడారు. శివసేనను హైజాక్ చేయడం అంత సులభం కాదని పరోక్షంగా బిజెపోళ్లకు చురకలంటించారు. శివసేన పార్టీ కోసం ఎందరో త్యాగాలు చేశారన్నారు. డబ్బుతో శివసేనను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరన్నారు. ఎంఎల్‌ఎలు ముంబయికి వస్తే వారు తమ వైపే ఉంటారన్నారు.
శిండే వర్గం ఎంఎల్‌ఎల హోటల్ బిల్లులు ఎవరు చెల్లిస్తున్నారని ఎన్‌సిపి నేతలు ప్రశ్నించారు. హోటల్‌కు చెల్లిస్తున్న నల్లదనం ఎక్కడి నుంచి వస్తుందో కొనుగోనలన్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతి ఎంఎల్‌ఎలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.
మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. శివసేన పార్టీ సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే వర్గం రోజు రోజుకు బలం పెంచుకుంటుంది. గౌహతి శిబిరంలో 50మంది వరకు ఎంఎల్‌ఎలు ఉన్నట్టు సమాచారం. ఈ రోజు ముంబయిలో శివసేన జాతీయ కార్యవర్గం భేటీ కానుంది. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శివసేన భవిష్యత్‌పై చర్చించనుంది.