ముంబై: మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి, శివసేన ఎంఎల్‌ఎ సంజయ్ రాథోడ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రేకు తన రాజీనామాను ఆదివారం మధ్యాహ్నం అందజేశారు. ఈనెల 8న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టిక్‌టాక్ స్టార్ పూజా చవాన్(22) కేసులో సంజయ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆమెతో మంత్రి తీసుకున్న ఫొటోలు, ఆడియో, వీడియో క్లిప్పింగులు బయటకు రాగా, ఆయన రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై ఆదివారం ముఖ్యమంత్రి థాక్రేను మంత్రి కలుసుకుని చర్చించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ పూజా చవాన్ మృతిని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, విచారణ పారదర్శకంగా ఉండాలనే తాను రాజీనామాకు నిర్ణయించానని చెప్పారు. రాథోడ్ కేవలం మంత్రి పదవికి రాజీనామా చేస్తే సరిపోదని, ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ప్రతిపక్ష నేత మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. అయితే ఆయన మద్దతుదారులు కొంతమంది విచారణ పూర్తయ్యేవరకు రాజీనామాను అంగీకరించవద్దని థాక్రేను కోరారు.
Shiv Sena Minister Sanjay Resigns