Monday, December 23, 2024

వేటాడిన పులి దంతాన్ని మెడలో ధరించా : శివసేన ఎంఎల్‌ఎ

- Advertisement -
- Advertisement -

ముంబై : 37 ఏళ్ల క్రితం 1987లో తాను పులిని వేటాడి దాని దంతాన్ని మెడలో ధరించుకున్నానని ఏక్‌నాథ్ షిండే సారథ్య శివసేన ఎంఎల్ఎ వివాదాస్పద ప్రకటన చేశారు. మహారాష్ట్ర లోని విదర్భ రీజియన్ బుల్ధానా నియోజక వర్గానికి చెందిన సంజయ్ గైక్వాడ్ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో గైక్వాడ్‌ను ఆ పులి అవశేషాలు ఎక్కడని ప్రశ్నించగా, తన మెడలో ధరించిన పులిదంతాన్ని చూపించారు. 1987లో పులిని వేటాడానని, దాని దంతాన్ని తొలగించి మెడలో ధరించుకున్నానని చెప్పారు. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవం సందర్భంగా సోమవారం ఆయన ఈ ప్రకటన చేశారు. అది రికార్డు అయింది. షిండేకు ప్రత్యర్థి ఉద్ధవ్ థాక్రేకు చెందిన పత్రిక సంస్థ సామ్నా దీన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. 1987 కు ముందే పులుల్ని వేటాడడం నేరంగా చట్టం అమలు లోకి వచ్చింది. దీనిపై గైక్వాడ్‌కు కాల్ చేయగా స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News