Sunday, December 22, 2024

రాహుల్ నాలుకను కోస్తే రూ. 11 లక్షల బహుమానం

- Advertisement -
- Advertisement -

శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాలుకను కోసిన వ్యక్తికి రూ. 11 లక్షల బహుమానం ఇస్తానంటూ ఆయన ప్రకటించారు. కాగా..గైగ్వాడ్ వ్యాఖ్యలను తాను సమర్థించబోనని శివసే సారథ్యంలోని ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షమైన బిజెపి మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే ప్రకటించారు. రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనలో మాట్లాడుతూ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారని, ఇది కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బహిర్గతం చేస్తోందని సోమవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో గైక్వాడ్ తెలిపారు.

రాహుల్ వ్యాఖ్యలు రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ వైఖరిని వెల్లడిస్తోందని రాహుల్ నాలుకను కోసిన వారికి రూ. 11 లక్షల బహుమానాన్ని ఇస్తానని గౌక్వాడ్ చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడించిందని ఆయన ఆరోపించారు. రాహుల్ తన వ్యాఖ్యల ద్వారా ప్రజలను మోసం చేశారని ఆయన తెలిపారు. మరాఠాలు, ధంగర్లు, ఓబిసిలు ఒక పక్క రిజర్వేషన్లు కావాలని పోరాడుతుంటే మరో పక్క రిజర్వేషన్లు అంతం చేయాలని రాహుల్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ రాహుల్ అసత్యాలు ప్రచారం చేశారని, కాని దేశాన్ని 400 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News