Sunday, December 22, 2024

యువకుని చితక్కొట్టిన ఎంఎల్‌ఎ

- Advertisement -
- Advertisement -

ముంబయి : ఒక యువకుని కర్రతో చితక్కొట్టిన బుల్ధానా శివసేన ఎంఎల్‌ఎ సంజయ్ గైక్వాడ్ వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు ఆయన చర్యను నిశితంగా విమర్శించాయి. మహారాష్ట్రలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. యువకుడు సంఘ వ్యతిరేక శక్తుల ముఠాలో సభ్యుడు అయినందున, ఒక పోలీసుపై దౌర్జన్యం చేసినందున తాను అతనిని కొట్టానని గైక్వాడ్ తెలిపారు. శివ్ జయంతి ఉత్సవాల సమయంలో ఫిబ్రవరి 19న ఆ సంఘటన జరిగిందని ఆయన తెలిపారు. ‘శివ్ జయంతి, అంబేద్కర్ జయంతి వంటి ఉత్సవాల సమయంలో ఒక యువకుల గుంపు ఆల్కహాల్, మాదకద్రవ్యాలు సేవించి,

ప్రజలపై, ముఖ్యంగా మహిళలపై దాడులు చేస్తుంటుంది’ అని బుల్ధానా ఎంఎల్‌ఎ చెప్పారు. జనం ఆ అక్రమ చర్యను తన దృష్టికి తీసుకువచ్చినప్పుడు పోలీసులకు చెప్పానని, కాని యువకుల గుంపు ఒక పోలీస్‌పై దాడి చేసిందని ఆయన తెలిపారు. ‘దాడిలో పోలీసు కింద పడిపోయాడు. దానితో తాను జోక్యం చేసుకున్నానని గైక్వాడ్ చెప్పారు. ఆ వీడియోను ఆధారంగా తీసుకున్న అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు విజయ్ వడెట్టివార్ స్పందిస్తూ, యువకుని కొట్టిన ‘గూండా’ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని వర్గం ఎంఎల్‌ఎ అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News