Sunday, December 22, 2024

గాయకుడు సోను నిగమ్‌పై శివసేన ఎంఎల్‌ఎ కుమారుడి దాడి

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ సినీ గాయకుడు సోను నిగమ్‌పై దాడి జరిగింది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో స్టేజ్ షో నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి ఆయనను తోసివేయడంతో మెట్లపై నుంచి సోను కిందపడ్డారు. ఈ సంఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. సోను స్టేజ్‌పైన పాడుతుండగా ఒక వ్యక్తి స్టేజ్‌పైకి దూసుకొచ్చి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా సోను సన్నిహిత మిత్రుడు రబ్బాని అడ్డుపడడంతో ఆయనను ఆ వ్యక్తి స్టేజ్‌పైనుంచి కిందకు తోసేశాడు.

దాడి చేసిన వ్యక్తిని స్వప్నిల్ ప్రకాష్ ఫటేర్‌పేకర్‌గా గుర్తించారు. ఈ సంఘటనపై సోను స్పందిస్తూ తనను వెనుక నుంచి ఆ వ్యక్తి తోసేశాడని, తాను మెట్లపైన పడిపోయానని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడిని చెంబూర్ శివసేన ఎంఎల్‌ఎ ప్రకాష్ ఫటేర్‌పేకర్‌గా పోలీసులు గుర్తించారు.అతడిపై చెంబూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News