Thursday, January 23, 2025

ఇక రాముణ్ని అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి..

- Advertisement -
- Advertisement -

ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీపై సెటైర్లు వేశారు. అయోధ్య రామమందిరంపై బీజేపీ చేస్తున్న హడావిడిపై ఆయన స్పందిస్తూ ఇక రాముణ్ని బీజేపి అభ్యర్థిగా ప్రకటించడం ఒక్కటే తరువాయి అని, అయోధ్యనుంచి గాని మరేదైనా నియోజకవర్గంనుంచి గానీ రాముణ్ని తమ అభ్యర్థిగా బీజేపీ త్వరలో ప్రకటిస్తుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. రాముడి పేరుతో దేశంలో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని సంజయ్ రౌత్ చెప్పారు.

కాంగ్రెస్ ను తాను జీరో అన్నట్లు ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు సంజయ్ రౌత్ సమాధానమిస్తూ, తానెప్పుడూ కాంగ్రెస్ ను జీరో అనలేదన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎంపీలు ఒక్కరు కూడా లేరని, తమ కూటమి కాంగ్రెస్ తో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఈసారి మహా వికాస్ అఘాడీ 40 సీట్లు గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News