న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేతోసహా శివసేనకు చెందిన 12 మంది తిరుగుబాటు ఎంపీలు మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలుసుకుని లోక్‌సభలో తమ పార్టీ సభాపక్ష నాయకుడిని మార్చాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కాగా.. తమ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీల నుంచి ఎటువంటి వినతిని స్వీకరించవద్దని కోరుతూ లోక్‌సభలో శివసేన సభాపక్ష నాయకునిగా వ్యవహరిస్తున్న వినాయక్ రౌత్ స్పీకర్ ఓం బిర్లాను కలుసుకున్న మరుసటి రోజే తిరుగుబాటు ఎంపీలు స్పీకర్‌ను కలుసుకోవడం విశేషం. శివసేనకు చెందిన 12 మంది లోక్‌సభ సభ్యులు స్పీకర్ ఓంబిర్లాను కలుసుకుని వినాయక్ రౌత్ స్థానంలో తమ పార్టీ లోక్‌సభాపక్ష నాయకునిగా రాహుల్ షెవాలేను నియమించాలని కోరినట్లు షిండే వర్గానికి చెందిన ఎంపి హేమంత్ గాడ్సే విలేకరులకు తెలిపారు. ఇలాఉండగా..శివసేన పార్లమెంటరీ నాయకునిగ తాను, చీఫ్ విప్‌గా రాజన్ విచారే నియమబద్ధంగా నియమితులయ్యామంటూ సోమవారం రాత్రి స్పీకర్‌కు సమర్పించిన వినతిపత్రంలో వినాయక్ రౌత్ పేర్కొనడం విశేషం.
Shiv Sena Rebel MPs meet LS Speaker over change floor leader