- Advertisement -
ముంబయి: మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్‌కోష్యారీ కేంద్ర హోంశాఖకు రాజకీయ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలోని తమ ప్రభుత్వం 8 నెలల క్రితం 12మంది సభ్యులను శాసనమండలికి సిఫారసు చేయగా ఆమోదముద్ర వేయకుండా తాత్సారం చేశారని విమర్శించింది. శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈ విమర్శలు గుప్పించింది. ఎంఎల్‌సిలను నామినేట్ చేయడంలో గవర్నర్ తీరును ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ కూడా తప్పు పట్టారని సామ్నా గుర్తు చేసింది. కోష్యారీ వయోవృద్ధుడైనందున మరిచిపోయి ఉంటారంటూ పవార్ చేసిన వ్యాఖ్యల్ని సామ్నా ఉటంకించింది. పైనుంచి(కేంద్రం నుంచి) ఒత్తిడి వల్లే సంతకం చేయలేదని భావిస్తున్నామని విమర్శించింది. గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధమని సామ్నా పేర్కొన్నది. బెంగాల్ గవర్నర్ తీరు కూడా ఇలాగే ఉన్నదని గుర్తు చేసింది.
- Advertisement -