Wednesday, January 22, 2025

శివసేన వివాదం: ఇసి నిర్ణయంపై స్టేకు సుప్రీం నిరాకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: శివసేన పేరును, పార్టీ చిహ్నాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అయితే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ షిండే వర్గాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇలా ఉండగా..పార్టీ కార్యకర్తలలో నైతిక స్థైర్యాన్ని నింపేందుకు రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టాలని ఉద్ధవ్ థాక్రే నిర్ణయించారు. పార్టీని బలోపేతం చేయడంతోపాటు పార్టీని సంస్థాగతంలో పునర్నిర్మించేందుకు కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని ఉద్ధవ్, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రే భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News