Sunday, December 22, 2024

శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. శ్రీకృష్ణ నిర్మాణ సంస్థలో ప్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన రెండు కోట్ల 70 లక్షల రూపాయల నగదును ఎసిబి అధికారులు సీజ్ చేశారు. బాలకృష్ణ ఇంకా ఏఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనే దానిపై ఎసిబి దృష్టి సారించింది. ఆ క్రమంలో బినామీల పేర్లతో భారీగా ఆస్తుల కొనుగోలుపైనా ఎసిబి అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

మరోవైపు పలు నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులపై సైతం ఎసిబి నజర పెట్టినట్లు సమాచారం. శివబాలకృష్ణ తన పేరిటే కాకుండా బంధువులు.. చిట్టచివరికి అటెండర్, డ్రైవర్‌ల పేరిట భారీగానే బినామీ ఆస్తుల్ని శివబాలకృష్ణ సమకూర్చారన్న ఆనుమానంతో ఆ ఇద్దరినీ ఎసిబి అరెస్టు చేసిన సంగతి విదితమే. ఓ వైపు శివబాలకృష్ణ ఆక్రమ ఆస్తులతో పాటు బినామీలు, బంధువుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఎసిబి పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News