Monday, December 23, 2024

రెండు స్కూటర్లు ఢీకొని ఇద్దరు శివభక్తుల మృతి..

- Advertisement -
- Advertisement -

Shiva Devotees Killed in Road Accident in Haridwar

హరిద్వార్ : హరిద్వార్ ఢిల్లీ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రెండు స్కూటర్లు ఢీకొని ఇద్దరు శివభక్తులు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. మృతులు రాహుల్ (సహరన్‌పూర్ నివాసి), శ్యామ్ ఠాకూర్ (ఘజియాబాద్)గా గుర్తించారు. రెండు స్కూటర్లు ఢీకొనడంతో శివభక్తులు గాలిలో ఎగిరి చాలా దూరంగా పడ్డారని కంఖల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ముఖేష్ చౌహాన్ చెప్పారు. రాహుల్, ఠాకూర్ అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని పోలీసులు తెలిపారు. కన్వర్ యాత్ర లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి హరిద్వార్‌కు వచ్చే శివభక్తులు గంగా జలాన్ని సేకరించి శివాలయాలకు సమర్పించి ఇళ్లకు వెళ్లిపోతుంటారు.

Shiva Devotees Killed in Road Accident in Haridwar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News