కాచిగూడ: ఇంగ్లీష్ ఛానల్‌ను రెండు వైపులా ఈది, ఆసియా ఖండంలోనే మొట్టమొదటి దివ్యాంగ స్విమ్మర్‌గా రికార్డు సృష్టించి, భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. భారతదేశం తరపున ఇంగ్లాడ్, ఫ్రాన్స్ మధ్య ఉన్న ఇంగ్లీష్ ఛానల్‌ను (అట్లాంటిక్ మహా సముద్రంలోని ఓ భాగం) రెండువైపులా ఈదిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందానని నగరానికి చెందిన దివ్యాంగ స్విమ్మర్ కె.శివకుమార్ వెల్లడించారు. గత నెల 19న ఇంగ్లీష్ ఛానల్‌ను 78కిలోమీటర్లు రానుపోను 31గంటల 29నిమిషాల్లో ఈది విజయవంతంగా పూర్తిచేసి, లండన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ మేరకు శుక్రవారం కొచ్ దినేష్ రజోరియాతో కలిసి బర్కత్‌పురలోని తుల్జాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివకుమార్ వివరాలను వెల్లడించారు.
తాను తెలంగాణ రాష్ట్రం తరపున పాల్గొని తొలి స్విమ్మర్‌గా రికార్డు నెలకొల్పానని చెప్పారు. ఇప్పటికే స్విమ్మింగ్‌లో మూడు బంగారు పతకాలు సాధించి రాష్ట్ర ప్రతిష్టను నలుదిశల చాటి చెప్పానని ఆయన వెల్లడిం చారు. రాష్ట్ర ప్రభుత్వం తనను అన్ని విధాలుగా ఆదుకొని, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే వచ్చే ప్యారా ఒలంపిక్, ఆసియాన్ గేమ్స్, కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొని బంగారు పతకం సాధించడమే లక్షంగా ముందుకుసాగుతానని ఆయన చెప్పారు.రికార్డు సాధించడం పట్ల ఇటీవల తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి తాను సాధించిన విజయం గురించి వివరించగా, మంత్రి దీనిని స్పందించి ప్రత్యేకంగా అభినందించారని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ నాయక త్వంలో రాష్ట్రంలో క్రీడాకారులకు, కోచ్‌లకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలోపతకాలు సాధించిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులను గుర్తించి వారికి ప్రో త్సహకాలను గణనీయంగా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దివ్యాంగ స్విమ్మర్ శివకుమార్ ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదడం గొప్పవిషయం అని, తెలంగాణ రాష్ట్రానికి గర్వ కారణమన్నారు. భవిష్యత్‌లో జరిగే పలు అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలలో విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని సూచించారు. శివకుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలవడానికి మంత్రిని అనుమతి కొరినట్లు వారు తెలిపారు.