Wednesday, January 22, 2025

‘ఘోస్ట్’ వచ్చేస్తోంది..

- Advertisement -
- Advertisement -

కరుణడ చక్రవర్తి డా. శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన యాక్షన్ స్పెక్టకిల్ ‘ఘోస్ట్’ కన్నడ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఘోస్ట్, తొలి రోజే అద్భుతమైన స్పందనతో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్‌గా తెరకెక్కించారు.

నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఘోస్ట్ నవంబర్ 4న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రమంతటా తెలుగులో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల ఏస్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి విడుదల చేసిన ఘోస్ట్ ట్రైలర్ కి మ్రంచి స్పందన వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News