Monday, December 23, 2024

23 లోక్‌సభ సీట్లలో శివసేన పోటీ: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలలో 23 స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పారీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోనందున ఆ పార్టీతో సీట్ల పంపకం చర్చలు సున్నా నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపి గెలుచుకున్న స్థానాలపై తర్వాత చర్చలు జరగుతుఆయని ఆయన చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని అవిభక్త శివసేన 23 స్థానాలలో పోటీ చేసి 18 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందగా ఆ పార్టీకి చెందిన చంద్రాపూర్ ఎంపి బాలు ధనోర్కర్ ఈ ఏడాది ప్రారంభంలో మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News