Friday, December 27, 2024

బాన్సువాడ టు శ్రీశైలం పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: శివ నామ స్మరణ చేస్తూ….. బాన్సువాడ నుంచి శ్రీశైలంకు దీక్ష స్వాములు, భక్తులు పాదయాత్రగా శుక్రవారం బయలుదేరారు. ఇరుముడులను నెత్తిన పెట్టుకుని శివదీక్ష గురుస్వామి సుభాష్ స్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రతియేడు లాగే కొనసాగుతుందన్నారు. రైతుబంధు జిల్లా అధ్యక్షులు దుద్దాల అంజిరెడ్డి స్థానిక సంగమేశ్వరాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం జెండాను ఊపి పాదయాత్రను ప్రారంభించారు. పరమ శివుని ఆశీస్సులతో పాదయాత్ర దిగ్విజయం కావాలని వేడుకుంటున్నామన్నారు. శివస్వాములు, భక్తులు సుమారు 400 కిలో మీటర్ల పాదయాత్రను పది రోజుల పాటు కొనసాగిస్తారని, శ్రీశైలంలో స్వామిని దర్శించుకున్న అనంతరం పాదయాత్ర ముగుస్తుందన్నారు. ఈ పాదయాత్రలో శివ దీక్ష స్వాములు, భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News