టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మరో భారీ సోషియో ఫాంటసీ మూవీ ‘కూర్మనాయకి’. ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్‌తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు.
శనివారం శివాజీ బర్త్ డే సందర్భంగా ఆయనను పుట్టినరోజు విషెస్ తో ప్రాజెక్ట్ లోకి వెల్‌కమ్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది కూర్మనాయకి టీమ్. శివాజీ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో భారీ పాన్ ఇండియా మూవీగా ‘కూర్మనాయకి‘ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. అత్యున్నత సాంకేతిక విలువలతో పాటు హై క్వాలిటీ వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఈ సినిమాకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. థర్డ్ షెడ్యూల్‌లో శివాజీ వచ్చి చేరారు. కూర్మనాయకి సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నారు. ఆయన ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు.