Monday, December 23, 2024

ఛత్రపతి విగ్రహం కూలడంపై క్షమాపణలు కోరిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

సింధుదుర్గ్‌ లో 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు కోరారు. ఈ ఘటనపై తాను శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నానన్నారు. మనందరికీ శివాజీ కేవలం మహారాజు మాత్రమే కాదని, ఆయన మనందరికీ గౌరవనీయమైన వ్యక్తి అన్నారు.

మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో వద్వన్ ఓడరేవు,ఇతర ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ఛత్రపతి శివాజీని తమ పూజ్య దైవంగా ఆరాధించే వారందరి మనోభావాలు ఈ విగ్రహం కూలిపోవడం వల్ల దెబ్బతిని ఉంటాయి… అందుకే నేను క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. తన సంస్కారం పూర్తిగా భిన్నమైనదని, మనకు గౌరవనీయ వ్యక్తులు, దైవం కంటే గొప్పది ఏదీ లేదన్నారు.

గత ఏడాది నేవీ డే (డిసెంబర్ 4) నాడు సింధుదుర్గ్‌లోని మల్వాన్ తహసీల్‌లోని రాజ్‌కోట్ కోటలో ప్రధాని మోదీ 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఈ విగ్రహం నాలుగు రోజుల క్రితం కుప్పకూలింది. అదే స్థలంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పునర్నిర్మిస్తామని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News