Monday, December 23, 2024

న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ మూవీ

- Advertisement -
- Advertisement -

‘ఆట మొదలెట్టావా శంకరా’.. ‘నీ వెనకుండి నడిపిస్తున్న ఆ గుంటనక్క గురించి కూడా తెలుసురా నా కొడకా’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్‌తో శివం భజే ట్రైలర్‌లో విశ్వరూపం చూపించాడు అశ్విన్ బాబు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ’శివం భజే’ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతోందని ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ చూస్తే అర్థం అవుతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మంగళవారం నాడు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి మాస్ కా దాస్ విశ్వక్ సేన్, తమన్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “ట్రైలర్ చూశా. చాలా బాగుంది. ఆగస్ట్ 1న ఈ సినిమాతో అశ్విన్‌కు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నా”అని అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ “శివం భజే ట్రైలర్ బాగుంది. అశ్విన్ ఏ సినిమా చేసినా ముందు నాకు చూపిస్తాడు. అతని కెరీర్‌లో శివం భజే ది బెస్ట్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. డైరెక్టర్ అప్సర్ మాట్లాడుతూ “ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది” అని అన్నారు. అశ్విన్ బాబు మాట్లాడుతూ “అప్సర్ ఓ ముస్లిం. ఆయన ఇలాంటి కథను ఎలా రాశారని అనుకున్నా. ఇదంతా కూడా శివ లీల అనిపించింది. అవుట్‌పుట్ చూస్తే ఇదంతా శివయ్యే చేయించాడని అనిపిస్తుంది. చాలా మంచి కాన్సెప్ట్‌తో రాబోతోన్నాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దిగంగనా సూర్యవంశీ, తమన్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News