Thursday, January 23, 2025

పరిమ్యాచ్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా శివమ్ దూబే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్పోర్ట్స్ వేర్ బ్రాండ్, పరిమ్యాచ్ స్పోర్ట్స్ తమ కంపెనీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా శివమ్ దూబే ను ఎంచుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేకముగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం జర్నలిస్టులకు స్టైలిష్ ఆల్ రౌండర్‌తో సంభాషించడానికి ఒక అవకాశాన్ని అందించింది, ఇటీవలి IPL లో అతని ప్రదర్శన మరియు భవిష్యత్తు ప్రయత్నాలను గురుంచి తెలుసుకునే అవకాశం కూడా లభించింది. ఈ కార్యక్రమం అతని క్రికెట్ ప్రయాణం తో పాటుగా అతని కెరీర్‌పై సమగ్ర సమాచారం అందించింది. క్రీడాకారులు పనితీరు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారనేది కూడా తెలుసుకునే అవకాశమూ కల్పించింది.

ఈ కార్యక్రమం లో శివమ్ మాట్లాడుతూ, పరిమ్యాచ్ స్పోర్ట్స్ దుస్తులు చాలా ఆసక్తిగా మరియు స్టైలిష్‌గా ఉన్నాయని, మంచి స్టైల్‌ని మెచ్చుకునే వ్యక్తిగా, తాను వీటిని విపరీతంగా అభిమానిస్తున్నానని వెల్లడించారు. దీనితో పాటుగా, క్రికెటర్ తన అభిమానులతో సందేశాలను పంచుకోటం తో పాటుగా ఔత్సాహిక అథ్లెట్లకు విలువైన సలహాలను అందించారు.

ముంబైలో జన్మించిన శివమ్ దూబే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకు సంపూర్ణ సహకారం అందించి తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ మరియు వైవిధ్యమైన మీడియం పేసర్‌గా అసాధారణమైన నైపుణ్యం ప్రదర్శిస్తూ,శివమ్ తన IPL కెరీర్‌లో ముఖ్యంగా తన బ్యాట్‌తో అత్యుత్తమ ప్రదర్శనలను ప్రదర్శించారు. విజయవంతమైన CSK జట్టులో అంతర్భాగ సభ్యునిగా, అతను 11 ఇన్నింగ్స్‌లలో 411 పరుగుల ఆకట్టుకునే స్కోర్‌ను సాధించారు, 159 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నారు, ఈ సీజన్‌లో జట్టు విజయావకాశాలను మెరుగు పరచటంలో అతను కీలక పాత్ర పోషించారు.

అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌తో క్లీన్ హిట్టర్ గా శివమ్ కు భారీ సంఖ్యలో అభిమానులు వున్నారు. యూత్ ఐకాన్ గానూ నిలిచారు. తాను ప్రాతినిధ్యం వహించే బ్రాండ్ కు తాజాదనం, గొప్ప శక్తి మరియు శైలిని తీసుకువస్తారు. పరిమ్యాచ్ స్పోర్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా, శివమ్ దూబే బ్రాండ్ యొక్క దుస్తుల శ్రేణిని సగర్వంగా ధరిస్తారు. పరిమ్యాచ్ స్పోర్ట్స్‌తో ఒప్పందంలో భాగంగా తన విస్తృత శ్రేణి అభిమానుల కు మరియు ఫాలోయర్స్ కు వాటిని పరిచయం చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News