Monday, December 23, 2024

గుండెపోటుతో బిజెపి నాయకుడు మృతి

- Advertisement -
- Advertisement -

శివమొగ్గ(కర్నాటక): కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు విరుద్ధంగా సీనప్ప శెట్టి సర్కిల్ లో సోమవారం నిరసన ప్రదర్శన చేస్తుండగా బిజెపి నాయకుడు, మాజీ ఎంఎల్ సి ఎం.బి. భాను ప్రకాశ్(69) గుండెపోటుతో మృతి చెందారు.

నిరసన ప్రదర్శనలో భాను ప్రకాశ్ ప్రసంగించారు. ఆ తర్వాత ఆయన కారు ఎక్కుతూ గుండెపోటుతో కుప్పకూలారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్లు ఆయన విగతజీవుడయ్యారని తెలిపారని బిజెపి వర్గాలు తెలిపాయి. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం శివమొగ్గ తాలూక మట్టూర్ గ్రామంలో జరుగనున్నాయి.

భాను ప్రకాశ్ బిజెపి లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా యూనిట్ అధ్యక్షుడిగా వివిధ స్థాయిల్లో పనిచేశారు. ఆయన బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయకుడు. మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్ యెడియూరప్పతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News